TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరోనా వ్యాక్సిన్ అంటే.. జనాలు పరుగులు.. 

Published on: Mon May 24, 2021 4:02PM

కరోనా సెకండ్ వేవ్ ఒక వైపు శవాలను స్మశానం ముందు దహనం కోసం వెయిట్ చేస్తున్నాయి. మరోవైపు కరోనా నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు వాక్సిన్ సెంటర్ల ముందు క్యూ లు కడుతున్నారు. ఇంకొందరు ఆ వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. ఇది చాలక మరో వైపు బ్లాక్ ఫంగస్ కూడా  దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశంలో మరో వైపు వ్యాక్సిన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. మరో వైపు ఇప్పుడు వస్తున్న బ్లాక్ ఫంగస్ కరోనా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకే వస్తున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా పై ప్రజలకు ఇప్పటి వరకు సరైన అవగాహనా కల్పించలేదని చెప్పాలి.. 

కరోనా మహమ్మారిని  కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తలమునకలు అవుతున్నాయి. ఎంతగానో శ్రమిస్తున్నాయి. ఇక ఈ కట్టడిలో భాగంగానే ప్రతి ఒక్కరు తప్పకుండ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేసింది. ఇక ఆ వ్యాక్సిన్ కోసం జనాలు ఆరోగ్య కేంద్రాలు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ స్టాక్ లేక టీకా తీసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మాకు టీకా వద్దు.. మమ్మల్ని వదిలేయండి అంటూ యూపీలోని ప్రజలు పరిగెడుతున్నారు. వ్యాక్సిన్ లేక అందరు బాధపడుతుంటే.. అక్కడి గ్రామస్థులు వ్యాక్సిన్ ఉన్నా కాని వేయించుకోవడానికి భయపడి నదిలో దూకి పారిపోయిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ గ్రామవాసులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. అందరికి కరోనా టీకాలు వేయనున్నట్లు వైద్యులు గ్రామస్థులకు తెలిపారు. ఆ మాట వినడంతో గ్రామస్థులు పరుగు లంకించుకున్నారు.  కొవిడ్ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి డివిజనల్ మెజిస్ట్రేట్ వివరించి చెప్పి గ్రామస్థులకున్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించిన  వారు వినలేదు. ఎక్కడ గ్రామంలోనే ఉంటే  టీకా వేస్తారేమోనని గ్రామా ఒడ్డున ఉన్న సరయూ  నదిలోకి దూకి మరీ పారిపోయారు. ఇంజక్షన్ అంటే విషపూరితమైనదని, దాన్ని తీసుకొంటే చనిపోతామనే భయం గ్రామస్థుల మనసులో నాటుకుపోయిందని  ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రయత్నాలు చేసి కష్టపడి  ఆ గ్రామంలో 14మందికి మాత్రం టీకాలు వేశామని తెలిపారు.