TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంటిలేటర్ పైనే విలాస్ రావ్

Published on: Wed Aug 8, 2012 10:09AM

మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖా మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ పరిస్థితి మరింత విషమంగా మారింది. కాలేయం, రెండు మూత్రపిండాలు సహా పలు అవయవాలు పనిచేయడం లేదని డాక్టరు చెబుతున్నారు. ఇటీవలే ముంబై ఆస్పత్రినుంది మెరుగైన చికిత్స కోసం ఆయన్ను చెన్నైలోని గ్లోబల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రసుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త బాగుపడితే కాలేయ మార్పిడి చేస్తారని సమాచారం. సినీనటుడు మరియు విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేశ్ ముఖ్ తన తండ్రికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నా విలాస్ రావ్ దేశ్ ముఖ్ కు కొడుకు కాలేయం సరిపోతుందా లేదా అన్నది వైద్యులు నిర్వహించే పరీక్షలలో తేలనుంది.