TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రోన్ ప్రారంభోత్సవంలో విషాదం...రెక్కలు తగిలి ఎమ్మెల్యే కు గాయం

Published on: Sun Apr 19, 2026 5:09PM

 

వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. కుల్కచర్ల మండల కేంద్రంలో వ్యవసాయ మందులు పిచికారి చేసే డ్రోన్‌ను ప్రారంభించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. టి రామ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభించి డ్రోన్‌ను ఎగరవేసిన కొద్దిసేపటికే అది నియంత్రణ తప్పి నేరుగా ఎమ్మెల్యే వైపు దూసుకెళ్లింది. డ్రోన్ రెక్కలు తగలడంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. 

ఘటన సమయంలో సమీపంలో ఉన్న పలువురికీ గాయాలు కావడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఎమ్మెల్యేను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కార్యక్రమానికి హాజరైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రోన్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.