విజయసాయిరెడ్డికి మరో 3 రోజుల కస్టడీ
Published on: Fri Jan 13, 2012 3:34PM
హైదరాబాద్ :ఆడిటర్ విజయసాయిరెడ్డికి కోర్టు మరో మూడో రోజులుపాటు సీబీఐ కస్టడీ విధించింది. ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీకి ఆదేశించింది. తిరిగి ఈనెల 17వ తేదీన కోర్టులో హాజరు పరచాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ సాయిరెడ్డిని విచారించాలని, తిరిగి చంచలగూడ జైలుకు తరలించాలని న్యాయస్థానం సూచించింది. కాగా సాయిరెడ్డికి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.


