TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ‌స్సు డ్రైవ‌ర్ చొక్కాప‌ట్టి.. కాలితో త‌న్ని.. బెజ‌వాడ యువ‌తి వీరంగం...

Published on: Thu Feb 10, 2022 10:38AM

వామ్మో విజ‌య‌వాడ అమ్మాయిలు. బాగా అగ్రెసివ్ అంటుంటారు. అంద‌రూ కాక‌పోయినా కొంద‌రు చాలా పొగ‌రుగా ఉంటార‌ని చెబుతుంటారు. లేటెస్ట్‌గా బెజ‌వాడ‌లో ఓ రౌడీ బుల్ల‌మ్మ రెచ్చిపోయింది. బండి దిగొచ్చి.. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాదింది. డ్రైవ‌ర్ చొక్కాప‌ట్టుకొని లాగింది. పిడిగుద్దులు గుద్దింది. కాలితో త‌న్నింది. నానా ర‌చ్చ రంబోలా చేసింది. ఇంత‌కీ విజ‌య‌వాడ‌లో అస‌లేం జ‌రిగిందంటే...

ఏపీఎస్‌ఆర్టీసీ విద్యాధరపురం డిపోకు చెందిన బస్సు ప్రకాశం రోడ్డులో వెళ్తోంది. అదే సమయంలో ఆంధ్రా ఆసుపత్రి సమీపంలో కృష్ణలంక తారకరామానగర్‌కు చెందిన నందిని అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డు వచ్చింది. డ్రైవర్ ముసలయ్య వెంట‌నే అల‌ర్ట్ అయి సడెన్ బ్రేక్ వేశాడు. బస్సు ఆమె బండి సమీపంలోకి వచ్చి ఆగింది. 

అంతే. ఇంకేం జ‌ర‌గ‌లేదు. అంత‌మాత్రానికే ఆ యువ‌తి కోపంతో ఊగిపోయింది. బ‌స్సు త‌న బండిని గుద్దితే ఎలా? అంటూ చిందులేసింది. బస్సెక్కి డ్రైవర్‌పై దాడిచేసింది. చొక్కా పట్టుకుని లాగి చింపేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. కాలితో తన్నింది. నోటికొచ్చిన‌ట్టు తిట్టింది. బెజ‌వాడ రౌడీయిజం మొత్తం చూపించింది.

బ‌స్సులో ఉన్న వారెవ‌రూ ఆమెను అడ్డుకోలేక‌పోయారు. కానీ, వారిలో ఎవ‌రో పోలీసుల‌కు ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మ‌హిళ‌తో పాటు డ్రైవర్‌నూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆర్టీసీ బ‌స్‌ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వ‌దిలేశారు.