మస్కిటో సిటీగా మారిన బెజవాడ
Published on: Thu Feb 16, 2012 3:35PM
విజయవాడ:విజయవాడ వెనిస్ నగరంగా తీర్చిదిద్దుతానని 2004లో ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రాజగోపాల్ ఆ నగరాన్ని మస్కిటో సిటిగా మర్చారన్న ఆపవాదును ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎక్కడ చూసినా చెత్త పెరుకుపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఉన్నప్పటికీ దోమలు ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత విజ్రుంభించాయి. పన్నుల వసూళ్ళుపై చూపిస్తున్న ఆసక్తిని కార్పోరేషన్ అధికారులు దోమల నివారణపై చూపించడంలేదు. గతంలో నిత్యం ఫాగింగ్ జరిపేవారు. ఇప్పుడు అటువంటి పనులేవీ చేయడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాట్లతో హాహాకారాలు చేస్తున్నారు.


