బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పూజారికి కరోనా
Published on: Wed Jun 24, 2020 5:59PM
మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఆలయాలను మూసి వేసి ఈ నెల 8 నుండి తిరిగి భక్తుల దర్సనానికి తెరిచిన సంగతి తెలిసందే. బెజవాడ లోని కనక దుర్గమ్మ ఆలయం లో రెండు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించి 10 నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.
ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుడిలోని అర్చకుడికి కరోనా సోకింది. దీంతో ఆయనను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ అర్చకుడు లక్ష కుంకుమార్చన పూజలో సేవలందిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుడిలోని ఇతర అర్చకులకు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా సోకిన అర్చకుడితో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారో ఆరా తీసి వారికి కూడా పరీక్షలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మరో పక్క విజయవాడలో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే.


