TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడలో రేపు తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం

Published on: Thu May 15, 2025 3:37PM

 

ఆపరేషన్ సిందూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని ఈనెల మే 16న విజయవాడలో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి నిర్ణ‌యించారు. శుక్రవారం సాయంత్రం ఈ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిస‌ర్కిల్ వ‌ర‌కు ర్యాలీ జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పురందేశ్వ‌రి ఆహ్వానించారు. కూటమి నేతలంతా యాత్రలో పాల్గొంటారని ఆమె తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడం, భారత్‌తో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో భారతీయ జనతా పార్టీ  దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది. పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ బీజేపీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించనున్నారు.