TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు : రామ్మోహన్‌ నాయుడు

Published on: Sat Oct 11, 2025 9:22PM

 

విజయవాడ నుంచి సింగపూర్‌కు మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించినున్నట్లు  పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడి తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. నవంబర్‌ 15వ తేదీన విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌లోని ఛాంగీ విమానశ్రయానికి చేరకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే అంతార్జాతీయ కనెక్టవిటీని ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం తెలుగు ప్రవాస భారతీయులకు విశేష ప్రయోజనం కలిగించడమే కాకుండా వ్యాపార, సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విమానయాన పటంలో గౌరవప్రదంగా నిలబెట్టే మైలురాయిగా నిలుస్తుందన్నారు. సింగపూర్‌లోని తెలుగువారికి మరిన్ని అవకాశాలు కల్పించేలా వైమానిక అనుసంధానాన్ని విస్తరించేందుకు మీరు చేపడుతున్న ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.