TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెజవాడ వైయస్సార్ కాంగ్రెస్ లో వర్గ పోరు

Published on: Tue Feb 14, 2012 2:30PM

  గౌతంరెడ్డి వర్సెస్ విజయలక్ష్మి
వియవాడ: ఢీ అంటే ఢీ అంటున్న ఇరువర్గాలు, పోలీసు కేసులు, పార్టీపోల్ తొలగింపు, రాష్ట నాయకులకు ఫిర్యాదు విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలతో అట్టుడుకుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి, ఆ పార్టీకే చెందిన మహిళా నాయకురాలు ఎల్లాప్రగడ విజయలక్ష్మిలు రెండు వర్గాలుగా విడిపోయి ఢీ అంటే ఢీ  అనుకునే పరిస్థితి ఏర్పడి పోలీసు కేసులదాకా చేరుకుంది. గౌతంరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు అనుచరులు తనపట్ల అసభ్యంగా వ్యవహరించడమే కాకుండా తనను బెదిరించారని వైయస్సార్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఎల్లాప్రగడ విజయలక్ష్మి కొద్దివారాల కిందట సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తదనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ లో విజయలక్ష్మి కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి ప్రసంగిస్తూ గౌతంరెడ్డి పార్టీలో ఉంటూ తనను రకరకాల పద్ధతుల్లో బెదిరిస్తున్నాడని, అతని బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని, అతని క్రిమినల్ రాజకీయాల గురించి, క్రిమినల్ చరిత్ర గురించి పార్టీ అధ్యక్షుడు జగన్ కి ఫిర్యాదు చేస్తానని... ఇలా పలువిధాలుగా గౌతంరెడ్డిని దుమ్మెత్తి పోసింది. ఆమె శివాజీ కేఫ్ సెంటర్ లో బహిరంగంగా గౌతంరెడ్డికి చాకిరేవు పెట్టడంతో కొంతసేపటి తరువాత పోలీసులు కంగారుగా వచ్చి ఆమె ప్రసంగాన్ని నిలుపుదల చేయించి అక్కడినుంచి పంపించి వేశారు. దరిమిలా తిరిగి వీరిద్దరి మధ్య ఉన్న వర్గ రాజకీయాలు గతవారం రగిలాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఏర్పాటుచేసిన జెండా పోల్ ను గౌతంరెడ్డి తన అనుచరుల ద్వారా కార్పొరేషన్ సిబ్బందిని ప్రలోభపెట్టి ఆ పోల్ ను తొలగించారని విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇదే విషయమై ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాక కార్పొరేషన్ సిబ్బందిని ప్రలోభపెట్టి ఆ పోల్ ను తొలగించారని విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇదే విషయమై ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాక కార్పొరేషన్ అధికారుల వద్దకు ఆమె ప్రదర్శనగా వెళ్ళి వారిని గట్టిగా నిలదీయడంతో కేవలం బ్యానర్లు మాత్రమే తొలగించమని తమ సిబ్బందికి చెబితే వారు పొరబాటున పోల్ ను తీసుకొచ్చారని చెప్పి ఆమెకి ఆ పోల్ ని తిరిగి అప్పగించడం జరిగింది. అయితే ఈ పోల్ ని కార్పొరేషన్ సిబ్బంది తీసుకెళ్ళడం వెనుక తాను గతంలో కేసు పెట్టిన ఇద్దరు వ్యక్తులు హస్తం ఉందని విజయలక్ష్మి బలంగా వాదిస్తున్నారు. సత్యనారాయణపురంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి గౌతంరెడ్డి అణచివేత వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రపార్టీ నాయకులందరికీ పోల్ తొలగింపు విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా బెజవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలోకి 'గౌతంరెడ్డి రాక పోర్టీకి వరమా లేక శాపమా' అనే అంశంపై త్వరలో సత్యనారాయణపురంలో రౌండ్టెబుల్ సమావేశం నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొందరు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.