TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణా,గుంటూరు,ఖమ్మం లలో భూప్రకంపనలు

Published on: Thu Jan 26, 2012 1:10PM

విజయవాడ : ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం స్వల్పగా భూమి కంపించినది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, పెనగంచిప్రోలు, కంచికచర్ల, వత్సవాయి మండలాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా అమరావతి, జిడుగు, జూపూడి, మల్లాదిలో స్వల్ప కంపనాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా మధిర, రూరల్‌ ప్రాంతాల్లో భూమి కంపించింది. షుమారు నిముషం పాటు భూమి  కంపించినది. భయంతో  జనం పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై నమోదు కానంతగా భూమి కంపించినట్లు ఎన్జీఆర్ఐ ప్రకటించింది.