TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్స లగడపాటికి మద్దతిస్తున్నారా?

Published on: Sat Dec 31, 2011 1:01PM

విజయవాడ: కృష్ణా జిల్లా కాంగ్రెసు రాజకీయాలు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వర్సెస్ మంత్రి పార్ధసారథిగా మారినట్లు కనిపిస్తోంది. పిసిసి మాజీ కార్యదర్శి శివాజీతో పాటు మరింత మంది సమావేశం ఏర్పాటు చేసి లగడపాటి రాజగోపాల్‌పై బహిరంగ విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది. వారిపై లగడపాటి రాజగోపాల్ పిసిసికి ఫిర్యాదు చేశారు. దాంతో పిసిసి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని వారిని ఆదేశించినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. దీంతో బొత్స సత్యనారాయణ లగడపాటి రాజగోపాల్‌కు మద్దతుగా నిలిచారనే ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ లగడపాటి రాజగోపాల్‌ వైపు నిలబడడంతో మంత్రి పార్ధసారథి ఇబ్బందుల్లో పడినట్లు భావిస్తున్నారు. దాంతో ఆయన పార్టీలోని అసమ్మతి వర్గానికి తన మద్దతు లేదని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అసమ్మతి వర్గీయుల సమావేశంలో తన పేరు ప్రస్తావించడం సరైంది కాదని కూడా ఆయన చెప్పారు.