వీరప్పమొయిలీతో రాములమ్మ భేటి
Published on: Tue Aug 20, 2013 9:36PM
.jpg)
టిఆర్ఎస్ బహిష్కృతనేత మెదక్ ఎంపి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరిపిన ఆమె తాజాగా వీరప్పమొయిలితో భేటి అయ్యారు. మెదక్ సీటు వద్దే టిఆర్ఎస్ పార్టీకి దూరం అయిన విజయశాంతికి కాంగ్రెస్ పెద్దలు అదే సీటుకు హామి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది.
విజయశాంతి కలిసి దిగ్విజయ్‌సింగ్‌తో భేటి అయిన రఘునందన్ ఇప్పటికే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. గతంలో విజయశాంతి ఇంట్లో 80లక్షల రూపాయల సెటిల్మెంట్ జరిగిందని ఆరోపించిన రఘునందన్ ఇప్పుడు విజయశాంతితో కలిసి కాంగ్రెస్ నేతలను కలవటం చర్చనీయాంశంమయింది. గతంలో రఘునందన్ చేసిన ఆరోపణల వెనుక కూడా విజయశాంతి ఉన్నారన్న ఆరోపణ ఉంది.


