రాజమౌళి ‘RRR’‌ని తలదన్నేలా కేసీఆర్‌ ‘RRR’‌‌

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. రాజమౌళి 'RRR' పేరుతో ఓ భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే మనకి తెలియకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఓ 'RRR' కి శ్రీకారం చుట్టారట. కేసీఆర్ ఏంటి, RRR ఏంటి అనుకుంటున్నారా? అది తెలియాయంటే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ట్వీట్స్ చదవాల్సిందే. ‘RRR’ మూవీని కేసీఆర్‌‌‌ ‘RRR’ (రీజినల్ రింగ్ రోడ్)తో పోలుస్తూ విజయశాంతి ట్వీట్స్‌ చేశారు.

'రాజమౌళి దర్శకత్వం వహించే RRR చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త RRR ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి RRR ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్. ఈ RRR కు, తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి ఒక లింక్ ఉందని తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే... తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి. దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట. ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ... ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం.' అని విజయశాంతి వరుస ట్వీట్స్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.