చంద్రబాబు తుపాకీ రాముళ్లను మించిపోయాడు
Published on: Mon May 13, 2019 3:15PM

వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రధాని పదవి కోసం కలలు కంటున్నాడు, ప్రధాని పదవేమో కానీ జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు.
"ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు. రాష్ట్రంలో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేదు. అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నాడని ‘కలల’ కథనాలు రాయించుకుంటున్నాడు. ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం." అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో టీవీ 9 రవి ప్రకాష్ ఇష్యూ ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. "చంద్రబాబు సమీక్షలకు వెళ్లాలంటే పార్టీ నాయకులు భయపడుతున్నారట. తన కుల(తొలి) వెలుగు కేసుల్లో ఇరుక్కుంటే కనీసం మాట సాయం చేయలేని పరిస్థితి. ఆ కోపమంతా తమపై ప్రదర్శిస్తున్నాడని తమ్ముళ్లు వాపోతున్నారట. మామూలుగా నైతే మీడియాపై దాడి అని రెచ్చిపోయేవాడు." అని ట్వీట్ లో పేర్కొన్నారు.


