కీలక పదవిలో ఉండి కుల రాజకీయాలా! విజయ.. ఛీయి

గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు.. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.. జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం. కులాలపై కవి గుర్రం జాషువా ఎప్పుడో చెప్పిన మాటలివి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నేతలకు ఇది అచ్చి గుద్దినట్లు సరిపోతోంది. విజ్ఞత లేనివాళ్లు..ఎటువంటి సంస్కారం లేని వాళ్లే కులం గురించి మాట్లాడుతుంటారు. ఆ కోవలో వచ్చేవారే  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఉన్నత చదువున్నా సంస్కారం లేనివాడుగా వ్యవహరిస్తున్నాడు. విజయసాయి బాటలోనే ఇతర వైసీపీ నేతలు నోరు తెరిస్తే కులాల కుంపటి రాజేస్తున్నారు.  ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కుల జడ్జీలు, కుల నాయకులు, కుల మీడియా అంటూ విద్వేష ప్రకటనలు చేస్తున్నారు. ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా నేతలకున్న సంస్కారం.. మనం ముందుకు వెళుతున్నా లేక వెనక్కి వెళుతున్నామా అన్న ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.  

 

కులాలు, మతాలను రాజకీయాలకు, సొంత ప్రయోజనాలకు ఆపాదించడం ఎంత మాత్రం సమంజసం కాదన్నది ఒక ప్రాథమిక సూత్రం. అయితే  వైసీపీ నేతలు ఆ విజ్ఞతను మర్చిపోయి ప్రవరిస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే.. ఏపీలో  మాత్రం వైసీపీ నేతలు కులాల కుంపటి రాజేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా తన తీరు మార్చుకోవడం లేదు విజయసాయి రెడ్డి. ఒక వర్గం నేతలే టార్గెట్ గా ఆయన అభ్యంతరకర ప్రకటనలు చేస్తున్నారు.  తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్త నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరని టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై  ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన విజయసాయి.. జాతి పేరుతో ప్రకటన చేయడం దుమారం రేపుతోంది. 

 

రాజధాని అమరావతి విషయంలోనూ విజయసాయి రెడ్డి ఎప్పుడూ కుల ప్రస్తావనే తెస్తారు. కమ్మని రాజధాని అంటూ ఓ కులానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. తన జాతి కోసమే చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారనే నీచమైన కామెంట్లు చేశారు. ‘కమ్మని’ అంటూ విజయసాయి రెడ్డి పరోక్షంగా కులాన్ని ప్రస్తావించడాన్ని  చాలామంది తప్పుపట్టారు. గతంలోనూ చాలా సార్లు ఆయన విపక్ష నేతలపై కులం పేరుతో కామెంట్లు చేశారు. దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన చంద్రబాబుపై  కులం పేరుతోనే కామెంట్స్ చేస్తారు. అంతేకాదు చంద్రబాబు సమర్ధించేవారికి కూడా జాతి, కులం అంటగడుతూ ట్వీట్లు, ప్రకటనలు చేస్తుంటారు విజయసాయి రెడ్డి. 

 

హైకోర్టు జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలపైనా  తీవ్రమైన ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి. కులం, జాతీ పేరుతో  వివిధ రూపాల్లో జడ్జీలపై ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లోనూ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశారు వైసీపీ ఎంపీలు. ఏపీ హైకోర్టు జడ్జీలను ఉద్దేశిస్తూ రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడారు విజయసాయి రెడ్డి. ఏపీ హైకోర్టు జడ్జీలపై జాతి  పేరుతో విజయసాయి రెడ్డి గతంలో పలుసార్లు ట్వీట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కీలక పదవిలో ఉన్న  విజయసాయి రెడ్డి.. అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి .. ప్రతి దానికి కులం అని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి .. ప్రతి దానికి కులం అని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాతి పేరుతో చీప్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
              

కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు ఎలక్షన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  అయితే  ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తన కులానికి చెందిన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి  అరోపణలు చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ” ఉల్లిపాయ” అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అప్పుడు కాపు కులానికి సంబంధించిన చాలా మంది ఆ వ్యాఖ్య వెనక పాతకాలం నాటి ముతక సామెత ని ప్రస్తావించే ఒక దురుద్దేశం ఉందంటూ విజయసాయిరెడ్డి మీద మండిపడ్డారు. 

 

విజయసాయిరెడ్డి కామెంట్స్ అత్యంత అభ్యంతరకరమని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ రకమైన కామెంట్స్ తో ఆ పార్టీ నాయకుల మనస్తత్వం  రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలిసిందని చెబుతున్నారు. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడన్న గుఱ్ఱం జాషువా గారి మాటలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు బీజేపీ నేతలు. పురేంధేశ్వరకి కీలక పదవి రావడాన్ని జీర్ణించుకోలేకే విజయసాయి రెడ్డి దిగజారే ప్రకటన చేస్తున్నారని  మండిపడుతున్నారు. పురందేశ్వరికి విజయసాయిరెడ్డి  బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగింటి ఆడపడుచుకి అధికారంలో వున్న జాతీయ పార్టీ జాతీయస్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతలు ఇస్తే అభినందించాల్సింది పోయి.. ఆమెకు జాతిని అంటగడుతూ కామెంట్స్ చేయడమేంటనీ ఏపీ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా.. తెలుగు జాతి ఆడపడుచు, జాతీయ పార్టీలో ఉన్నత స్థానం సంపాదిస్తే అభినందించాల్సింది పోయి..  ఇలా అమరావతికి, కులానికి లింక్ పెట్టి మాట్లాడటానికి సిగ్గు ఉండాలని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. 

 

కుల, మతాల కతీతంగా పని చేస్తామని ప్రజా ప్రతినిధులు ప్రమాణం చేస్తారు. రాజ్యసభలోనూ రాజ్యాంగ స్పూర్తిని కాపాడుతానని విజయసాయి రెడ్డి ప్రమాణం చేశారు. అయితే రాజ్యాంగ ఆశయాలకు  విరుద్ధంగా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారు. అతను ప్రమాణంలో చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేంటీని ప్రజలు నిలదీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి.. కుల, తమ విధ్వేషాలు రేగేలా విద్వేష ప్రకటనలు చేస్తున్నా.. చర్య తీసుకునే అవకాశం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మన దేశ రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగిస్తున్నా,, చూస్తూ భరించాల్సిందేనా అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభలో కూర్చుంటూ సిగ్గు లేకుండా కులాల గురించి మాట్లాడే విజయసాయికి .. రాజ్యసభలో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు. 

 

మరోవైపు కుట్ర పూరితంగానే వైసీపీ నేతలు కులాల కుంపట్లు రాజేస్తున్నారనే ఆరోపణలు చే వస్తున్నాయి. కొందరిని , ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలను సీఎం జగన్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ నేతలను వారించడం లేదంటే ఆయన అంగీకారంతోనే నేతలు మాట్లాడినట్లు భావించాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు.