విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
Published on: Mon Jan 2, 2012 8:39PM
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయి రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి దిల్కుషా గెస్ట్‌హౌజ్‌లో విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు. అనంతరం సుదీర్ఘ విచారణ కొనసాగించారు. ఆ తర్వాత రాత్రి 8.25 నిమిషాలకు సీబీఐ విజయసాయి రెడ్డి గన్మెన్లను ఇంటికి వెళ్లమని చెప్పి ఆయనను సీబీఐ తన వాహనంలో తీసుక వెళ్లినట్లు తెలుస్తోంది.జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డిపై మొత్తం 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది 120(బి), 409, 477, 477(ఏ) సెక్షన్ల కింద డిసెంబర్ 17 తేదిన కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ అండ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్13 క్లాజ్ 4 కింద మొత్తం 72 మందిపై సీబీఐ అభియోగాలు మోపారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పరిధిని మించి విచారణ చేస్తోందని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పిటిషన్లో తెలిపారు. ఈ కేసులో పదుల సార్లు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.విజయసాయి రెడ్డి అరెస్టుతో కేసులో కీలక మలుపు తిరిగినట్లు చెపుతున్నారు.


