TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయానికి దిగజారుడు మెట్లు..!

Published on: Mon Sep 3, 2012 7:07PM

VIJAYANIKI METLU, YANDAMOORI VERENDRA NADH, new project, blood, blood donation, blood bank, blood sale, blood black market, blood donors, fans, chiru udyogi, Hyderabad charity

 

అతి తక్కువ కాలంలో అందనంత ఎత్తుకు ఎదిగిన ఓ మహావ్యక్తికి ఓ ప్రముఖ రచయిత పిచ్చ ఫ్యాన్. తను మంచి బూమ్ లో ఉన్న రోజుల్లో అభిమాన నక్షత్రాన్ని తలుచుకుని పొంగిపోతూ విజయం సాధించడానికి ఎన్ని మెట్లు ఎలా ఎక్కిందీ వివరిస్తూ ఓ పే.....ద్ద నవల రాసిపారేశాడు. అప్పట్లో అభిమానం అలాంటిది మరి. తర్వాత కాలంలో చాలా మార్పులొచ్చేశాయ్. రాజకీయంలోకి అడుగుపెడితే రెండు చేతులేంటి వందచేతులతో డబ్బులు పోగేసుకోవచ్చు.. అని ఐనవాళ్లు సలహా ఇచ్చారు. అరగేట్రంకూడా చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ.. చివరికి నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునిగారు. ఏదో ఒరుగుతుందని నమ్మివచ్చినవాళ్లంతా మట్టికొట్టుకుపోయారు. అయినా సదరు మహావ్యక్తికి ధనదాహం తీరలేదు. తనను అభిమానించే వాళ్లని అడ్డంగా వాడుకోవడానికి ముందునుంచీ నడుపుతున్న దేశోద్ధరణ కార్యక్రమాల్నికూడా సంపాదనకోసం ఉపయోగించుకుందామన్న యావ ఎక్కువైపోయింది. పేదవాడి రక్తపు చుక్కల్నికూడా డబ్బుల్లోకి మార్చేసుకోవచ్చన్న కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. అంతే డబ్బులే డబ్బులు.. కుక్కని కొడితే డబ్బులు రాలుతున్నాయ్.. ఉన్న ఇమేజ్ కి తోడు కొత్తగా పవర్ కూడా తోడవడంతో ఏదైనా జరిగితే అప్పటికప్పుడు మ్యానేజ్ చేసుకోవడం చాలా వీజీ అయిపోయింది. అరాచకాలకు అడ్డేలేకుండా పోయింది. సదరు మహావ్యక్తి జీవనపయనం నిరుపేదగా మొదలైంది. తర్వాత జీవితమే నాటకమైపోయింది. కష్టపడి పైకొచ్చాడని అంతా పొగిడారు. కానీ.. ఆ కష్టం వెనక ఎన్ని మతలబులు, ఎన్ని నిజజీవితపు రాజకీయాలూ ఉన్నాయో.. బాగా దగ్గరగా ఎరిగిన రచయితగారికి చాలాకాలం తర్వాత తెలిసొచ్చింది. మహావ్యక్తికి వీరాభిమాని అయిన రచయితకు మాత్రం కళ్లెదుటే జరుగుతున్న అరాచకాల్ని చూసి కడుపుమండిపోయింది. వెటరన్ నావెలిస్ట్ బుచ్చిబాబుని ఆదర్శంగా తీసుకుని, ఎన్ని కడుపులు కొట్టి ఎంత కూడబెట్టినా చివరికి మిగిలేదేంలేదు బూడిదతప్ప అన్న నిజాన్ని నూరిపోసే కొత్త నవల రాసేందుకు సిద్ధపడ్డాడు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని ఎంత త్వరగా మార్కెట్లోకి విడుదల చేయాలా..? ఎంత త్వరగా తను అభిమానించిన మహావ్యక్తి దిగజారుడుతనాన్ని కళ్లకు కట్టినట్టు జనానికి చెప్పాలా.. ? అన్న తహతహ రచయితకు పెరిగిపోయింది. ఇదేదో చాలా వెరైటీగా మార్కెట్లోకొచ్చేట్టుగా ఉందని పాఠకులుకూడా యమ ఆసక్తిగా ఆ కొత్త నవలకోసం ఎదురుచూస్తున్నారు. రచనాగ్రేసరుడి కొత్త నవలకు ఎంత పాపులారిటీ రాబోతోందో కాలమే నిర్ణయించాలి.