TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోటిపామ్ పవర్ ప్లాంటుపై సమరం

Published on: Fri Apr 27, 2012 11:45AM

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కోటిపామ్ వద్ద నిర్మించ తలపెట్టిన బొగ్గు ఆధారిత ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు యుద్దాన్ని ప్రకటించారు. ఎత్తి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంటును నిర్మించకుండా అడ్డుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్లాంటుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

 

 

 

 

కోటిపామ్ విద్యుత్తు ప్లాంటు నిర్మిస్తే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్వావరణం దెబ్బతింటుందని, భూగర్భజలాలు అడుగంటిపోవటమే కాకుండా ఉన్న కొద్దిపాటి జలాలు కలుషితమవుతాయబి పోరాతకమిటి హెచ్చరిస్తోంది. ఈ పవర్ ప్లాంట్ కారణంగా నాగావళి, ఝంజావతి నదుల నీరు కలుషితమవుతుందని, అందువల్ల తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీన్ని నిర్మిస్తే కోటిపామ్, రేగులపాడు, కొమరాడ, కొత్తవలస, గుమడ తదితర గ్రామాలన్నీ ఖాళీ చేయాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. నాగావళి నీటిని ఈ పవర్ ప్లాంట్ కు వినియోగిస్తే తోటపల్లి ఆయకట్టు భూములు దెబ్బతింటాయని వారు అంటున్నారు.