TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయనగరం జిల్లాలో అక్రమంగా మాంగనీస్ తవ్వకాలు

Published on: Mon Mar 5, 2012 11:13AM

విజయనగరం: విజయనగరం జిల్లా గరివిడి మండలం పరిసరప్రాంతాల్లో కొందఱు వ్యక్తులు మాంగనీస్ గనులను అక్రమంగా తవ్వి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లు తెలిసింది. మాంగనీస్ నిల్వలను వీరు అక్రమంగా తవ్వి గుట్టుచప్పుడు కాకుండా లారీల్లో పొరుగునేవున్న ఒరిస్సాకు తరలిస్తున్నారు. వీటిని సరిహద్దుప్రాంతంలోని మైదానప్రాంతాల్లో అక్రమంగా నిల్వచేసి తరువాత విక్రయిస్తున్నారు. వీటిని అరికట్టవలసిన ప్రభుత్వ యంత్రాంగాలను నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల భూగర్భ గనులశాఖ అధికారులు దాడులుచేసి గరివిడి మండల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు వెయ్యి టన్నుల మాంగనీసును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంగనీసులో కొంత నిల్వను ఇటీవల వేలం వేయగా ఆ శాఖకు సుమారు రూ.12 లక్షల ఆదాయం వచ్చింది.