TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వికటించిన విజయ్ కాంత్ ప్లాన్.. ఒంటరి వాడయ్యాడా...?

Published on: Tue Mar 22, 2016 1:04PM

 

ఒంటరినై పోయాను అన్నట్టు ఉంది ప్రస్తుతం డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ పని. నిన్న మొన్నటి వరకూ హడావుడిగా ఉన్న ఈయన ప్రస్తుతం ఒంటరి వాడై పోయినట్టు కనిపిస్తోంది. అసలుసంగతేంటంటే.. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీలన్నీ పోరుకు సిద్దమవుతున్నాయి. పార్టీల్లోకి వచ్చే వాళ్లు వస్తున్నారు.. పోయే వాళ్లు పోతున్నారు. అయితే సాధారణంగా ఎన్నికలప్పుడు ఒకోసారి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాయి. కానీ ఈసారి తమిళనాడులో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఇతర పార్టీలు కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. దీంతో సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కూడా ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

 

అసలు డీఎంకే, బీజేపీలు పార్టీలు డీఎండీకే తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో దిగాలని చూసింది. కానీ విజయ్ కాంత్ మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోనంటూ ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడే విజయ్ కాంత్ తప్పులో కాలేసినట్టు కనిపిస్తోంది. ఆయన ఒంటరి పోరాటం వికటించింది. ఎందుకంటే అప్పటి వరకు విజయకాంత్‌ చెంతవున్న అనేక మంది కీలక నేతలు.. ఆయన ఎప్పుడైతే ఒంటరి పోరాటం అన్నారో ఆయనకు చెప్పాపెట్టకుండా జారుకున్నారు. పెద్ద పార్టీల సంగతే దేవుడికి ఎరుగు.. చిన్న పార్టీలు కూడా కనీసం ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడంలేదు. చివరకు తన చుట్టూ ఉన్న నాయకగణం సైతం చల్లగా జారుకుంది. కనీసం కూడా టిక్కెట్‌ ఇవ్వమని కోరేవారే లేకుండా పోయారట. దీంతో ప్రస్తుతం విజయ్ కాంత్ ఏం చేయాలో తెలియని అయోమయంలో పడినట్టు తెలుస్తోంది.