విరామం తర్వాత మీడియా ముందుకు విజయశాంతి
Published on: Wed Jan 4, 2012 11:34AM
హైద
రాబాద్: చాలా రోజుల విరామం తర్వాత విజయశాంతి మీడియా ముందుకు వచ్చారు. వచ్చీ రావడంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీలపై దుమ్మెత్తి పోశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ పిల్లపార్టీ అని, అలాంటి పార్టీతో తామేదో కుమ్మక్కయ్యామంటూ తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిచడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే, తెలంగాణ గడ్డపై తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమే అని చెపుతున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో నూకలు చెల్లిపోనున్నాయని జోస్యం చెప్పారు.


