4 రోజుల్లో పచ్చదొంగలు దోచుకున్న వేల కోట్లు బయటకి!

 

పోలవరం ప్రాజెక్టులో అవినీతి విషయమై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని టీడీపీ చెప్తుండడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

"పోలవరం ప్రాజెక్టును కల్పతరువులా భావించారు చంద్రబాబు. అంచనాలు పెంచి ప్రతి పనిలో నిధులు దోచుకున్నారు. ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం నిర్మాణాల్లో 2343 కోట్లు కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఇదీ కక్ష సాధింపేనంటారా బాబూ?" అని విజయసాయి ట్వీట్ చేసారు.

మరో ట్వీట్ లో "పోలవరంపై రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చెప్పిన జవాబును చంద్రబాబు గారికి సరిగా బ్రీఫ్ చేసినట్టు లేరు. ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. సీబీఐ రంగంలోకి రాదని మురిసి పోతున్నారేమో బాబు గారు." అని ఎద్దేవా చేసారు.

"పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల కోట్లు కక్కిందాకా ప్రభుత్వం వదిలి పెట్టదు." అని విజయ సాయి మరో ట్వీట్ లో పేర్కొన్నారు.