TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పుడు షర్మిల.. ఇప్పుడు విజయసాయి?

Published on: Tue Sep 8, 2026 10:56AM

 వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్   తన  మద్దతుదారులందరినీ శత్రువులుగా మార్చుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నారు.  జగన్ జైలులో ఉన్న సమయంలో ఆయన కోసం రోడ్డెక్కి పోరాడిన సొంత చెల్లి, తల్లితో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఆ కోవలోకే విజయసాయి రెడ్డి చేరారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు చేదోడువాదోడుగా నిలిచారు. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ పుంజుకుని.. 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారపగ్గాలు అందుకోవడంలో జగన్ అన్ని విధాలుగా అండదండగా నిలిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి.  అటువంటి విజయసారిరెడ్డి జగన్ కు దూరం జరిగారు. పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాలోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ప్రకటించి.. ఏకంగా సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మీడిమా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు.  ఆ సందర్భంగా తనను రెచ్చగొడితే గుట్టుముట్లు బయటపెడతా తస్మాత్ జాగ్రత్త అంటూ పరోక్షంగా జగన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు.  

ఇప్పుడు చూస్తే.. జగన్ కు సొంత చెల్లి 2024 ఎన్నికల ముందు శత్రువుగా మారి, ఆ ఎన్నికలలో జగన్ ఒటమిలో తన వంతు పాత్రపోషించారు. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ పునాదులను షర్మిల కదిలించగలగారు. ఆ ఎన్నికలలో సునీత ప్రచారం ఫలితాలపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ 2019 ఎన్నికల ముందు  కాలికి బలపం కట్టుకుని తిరిగి ఎలాగైతే ఆ ఎన్నికలలో జగన్ ఘన విజయం సాధించి సీఎం కావడానికి దోహదపడ్డారో.. అలాగే.. 2024 ఎన్నికలకు ముందు సొంత చెల్లినైన తనను జగన్ ఆస్తిపంపకాలలో ఎలా మోసం చేశారో, సొంత బాబాయ్ హంతకులకు జగన్ ఎలా సహకారం అందించారో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన పరాజయానికి కూడా దోహదపడ్డారు. 

ఇప్పుడు ఇక జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసే పని గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, మద్దతు దారుడూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కుడి భుజంగా వ్యవహరించిన విజయసాయి రంగంలోకి దిగారని చెప్పవచ్చు.  2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర ఇప్పుడు అంత కంటే బలంగా, ప్రభావమంతంగా విజయసాయి పోషించనున్నారన్న మాట.  

జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై సాయిరెడ్డికి పూర్తి అవగాహన ఉంది.  జగన్ ఆర్థిక వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఇప్పటికే ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ప్రతిష్టపై సాయిరెడ్డి వెల్లడించే ఏ చిన్న వివరమైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే 2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర, 2029 ఎన్నికలలో విజయసాయి పోషించనున్నారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  


[Vijaya Sai Reddy Real Threat To  Jagan, Y P internal crisis, AP politics, Sharmila, TeluguOne News]