TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కియా మోటార్స్ కుంభ‌కోణం.. దొంగ ఏడుపులు వద్దు

Published on: Tue Jun 4, 2019 3:10PM

 

గతంలో టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌చారం చేసుకున్న కియా మోటార్స్ గురించి వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని పేర్కొన్నారు.

విజ‌య సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో టీడీపీ మీద విరుచుకుపడ్డారు. "కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయి. దొంగ ఏడుపులు వద్దు. యువ సీఎంకు ఏం చేయాలో తెలుసు. కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుంది." అని ట్వీట్ చేశారు.

ఆఫీసుల అద్దె చెల్లింపుల్లోనూ చంద్ర‌బాబు ప్ర‌బుత్వం అవినీతికి పాల్ప‌డింద‌ని సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. "ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?" అని ప్రశ్నించారు.