TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్రమంత్రిగా విజయసాయి రెడ్డి?

Published on: Thu Jun 7, 2018 5:10PM

 

బీజేపీ, టీడీపీల మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ.. బీజేపీ, వైసీపీల మధ్య బంధం బలపడుతూ వచ్చింది.. ఈ బంధం గురించి రెండు పార్టీలు ఆఫీసియల్ గా చెప్పనప్పటికీ.. బీజేపీ-వైసీపీల బంధం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.. ఇప్పుడీ బంధానికి మరింత బలం చేకూరుస్తూ.. ఒక షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.. అదేంటంటే.. విజయసాయి రెడ్డికి కేంద్రమంత్రి పదవి వరించబోతుందట.. ఇదెవరో బయటవాళ్ళు అన్న వార్త కాదంట.. సాక్ష్యాత్తూ విజయసాయి రెడ్డే.. త్వరలో వైసీపీ ఎన్డీయేలో చేరబోతున్నట్టు అలానే తాను త్వరలో కేంద్రమంత్రి అవబోతున్నట్టు ఆయన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది.. ఈ వార్తలో నిజమెంతో తెలీదు గాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అనిపిస్తుంది...