విజయనిర్మల అంత్యక్రియలు రేపు...ఎందుకంటే ?
Published on: Thu Jun 27, 2019 11:47AM

అనారోగ్యంతో మృతి చెందిన అలనాటి ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మలకు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. నిన్న రాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందిన విజయనిర్మల పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని వారి ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఇక రేపు ఉదయం ఫిల్మ్‌ఛాంబర్‌కు ఆమె భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు, అక్కడ సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. అనంతరం విజయనిర్మల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఆమె మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఆమెకి నివాళులు అర్పించారు. విజయ నిర్మల ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆమె కుమారుడు నరేష్ ప్రకటించారు.


