TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్ట్ - బీజేపీ ఆఫర్?

Published on: Sun Mar 15, 2026 5:52PM

 

తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పొత్తులో భాగంగా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ఈ ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 

టీవీకేతో పొత్తుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విజయ్ పార్టీకి 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విజయ్ సీఎం పదవిపై దృష్టి పెట్టారని, చర్చల్లో ఆ విషయం కీలకంగా మారిందని చెప్తున్నారు. బీజేపీ, డీఎంకేలతో తమకు పొత్తులు ఉండవన విజయ్ గతంలోనే తేల్చి చెప్పారు. అయినా పొత్తులపై ప్రచారం జరుగుతూనే ఉండటం విశేషం.