TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ కుట్ర? 

Published on: Wed Oct 27, 2021 11:48AM

తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో నేతలు స్పీడ్ పెంచారు. హోరాహోరీగా పోరాడుతున్న అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు బీజేపీ నేతలు. 

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో హరీష్‌రావుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్ రావు అని అన్నారు. హుజురాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని వ్యాఖ్యానించారు.  గతంలో కేటీఆర్‌ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్ రావని ఆరోపించారు. దుబ్బాకలో చెల్లని హరీష్ రావు హుజురాబాద్‌లో చెల్లుతారా అంటూ విజయశాంతి దుయ్యబట్టారు.