TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తమిళనాడు సీఎం మెట్రో రైడ్.!

Published on: Thu Jul 30, 2026 11:24AM

కాన్వాయ్ లేదు..   సెక్యూరిటీ సైరన్ల గోల అసలే లేదు!  తమిళనాడు ముఖ్యమంత్రి సింప్లిసిటీకీ నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది ఆయన మెట్రోరైలు ప్రయాణం. సాధారణ ప్రయాణికుడిలా క్యూలో నిలబడి, టికెట్ కొనుక్కుని, మెట్రో ట్రైన్ ఎక్కేశారు  తమిళనాడు సీఎం విజయ్.   ముఖ్యమంత్రి నిరాడంబరంగా, హంగూ ఆర్భాటం లేకుండా మెట్రోలో ప్రయాణిస్తూ, పక్కనున్న ప్రయాణికులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   

 తమిళనాడు రాజకీయాల్లో   విజయ్ మెట్రో  ప్రయాణం ఒక  హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సరాసరి మెట్రో స్టేషన్‌కు చేరుకుని సాధారణ ప్రయాణీకుడిలా  క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో  ప్రయాణికుల మధ్య కూర్చుని పక్కన ఉన్న వారితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మెట్రో సర్వీసులు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. విద్యార్థులు, ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. అసలైన ప్రజానాయకుడంటూ.. సామాన్య జనం కూడా వ్యాఖ్యానిస్తున్నారు. 

అయితే విమర్శకులు ఒక ఫోటో షూట్ లేదా ఒక మెట్రో రైడ్ తో విజయ్ పాలన హిట్ అని టాక్ స్ప్రెడ్ అయిపోవడానికి ఇది సినిమా కాదని పెదవి విరుస్తున్నారు.  మంచి ఫోటోలు, వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో వ్యూస్ రావడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించవంటున్నారు.  

Vijay metro ride shakes social media, Thalapathy Vijay Metro Video, TVK Vijay Politics, Tamil Nadu CM Vijay,  TeluguOne