మాల్యా చుట్టూ బ్రిటన్ ఉచ్చు

బ్యాంకుల వద్ద తీసుకున్న వేలకోట్ల రుణాన్ని ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను ఎలాగైన భారత్‌కు రప్పించాలని సీబీఐ, ఈడీ చేస్తున్న ప్రయత్నాలకు యూకే నుంచి గట్టి మద్ధతు లభిస్తోంది.  ఇండియాలో మాల్యా అవినీతిని గురించి సీబీఐ, ఈడీ వాదనలు విన్న వెస్ట్ మినిస్టర్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న విజయ్ ఆస్తులను స్తంభింపజేయాలని.. బ్యాంకు లావాదేవీలను నిలిపివేయాలని.. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం మాల్యాకు వారానికి రూ.4 లక్షలు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో పడిపోయారు విజయ్ మాల్యా.