Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాల్యాకు షాక్... ‘దొంగ, దొంగ’ అని కేకలు
posted on: Jun 12, 2017 12:00PM
.jpg)
భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ను చూడటానికి వచ్చి.. దర్జాగా, ఎలాంటి భయం కూడా లేకుండా మ్యాచ్ చూసిన సంగతి తెలిసిందే. ఇక మాల్యాను చూసిన జనం కూడా షాకై ఆయనపై కామెంట్లు కూడా విసిరారు. అయితే ఈసారి మాత్రం మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో నిన్న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవర్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు మాల్యా కూడా వచ్చాడు. ఇంతలో మాల్యాను చూసి కొంతమంది ఒక్కసారిగా ‘దొంగ, దొంగ’ అంటూ కేకలు వేయడంతో అక్కడున్నవారు ఆయనను చుట్టుముట్టారు. దీంతో షాక్ తిన్న మాల్యా స్పీడ్ గా స్టేడియం లోపలకు వెళ్లిపోయారు. కాగా బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి మాల్యా ప్రస్తుతం లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.






