మాల్యాకు మరో షాకిచ్చిన ఈడీ...

 

విజయ్ మాల్యా ఈడీ ఇప్పటికే షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో భారీ షాక్ ఇచ్చింది. మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసిన ఈడీ.. ఇప్పుడు మాల్యాకు చెందిన వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసింది. మాండ్వా లోని  రూ.100 కోట్ల విలువైన పొలాలను,  ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుంది. కాగా ఇటీవల మాండ్వా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ  నోటీసులు పంపించగా..  ఈ నోటీసులపై మాండ్వా ఫామ్స్‌  లిమిటెడ్‌ న్యాయవాదులు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ రెండురోజుల క్రితం  తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అలీబాగ్‌లోని  మాండ్వా  ఫామ్‌ హౌస్‌  సహా  17 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది.