వన్‌టైం సెటిల్‌మెంట్ కు రెడీ అయిన మాల్యా...
Published on: Fri Mar 10, 2017 2:08PM

బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాల్లో ఉంటున్న విజయ్ మాల్యా ఆఖరికి సెటిల్ మెంట్ కు దిగొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ట్వీట్టర్ ద్వారా ఓ ట్వీట్ ట్వీటాడు.‘ప్రభుత్వ రంగ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్ పాలసీలు ఉన్నాయి. వందల మంది దీన్ని ఉపయోగించుకున్నారు. మాకు మాత్రం ఎందుకు దీన్ని నిరాకరిస్తున్నారు’ అని ఆయన ప్రశ్నించారు.సుప్రీంకోర్టు ముందు తమ ఆఫర్ ఉంచినప్పుడు బ్యాంకులు ఏమ్రాతం పట్టించుకోకుండా తిరస్కరించాయని మాల్యా తెలిపారు. పారదర్శకంగా బ్యాంకులతో సెటిల్‌మెంట్ చేసుకోవడానికి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్వీట్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, సెటిల్‌మెంట్ చేసుకునే విధంగా బ్యాంకులను ఆదేశించాలని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరి సుప్రీంకోర్టు మాల్యా అభ్యర్థనను మన్నించి సెటిల్ మెంట్ కు ఒప్పుకుంటుందో..? లేదో..? చూద్దాం.


