మాల్యాకు శిక్ష విధించలేం...

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాకు శిక్ష విధించలేమని హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని థర్డ్ సెషన్స్ కోర్టు  న్యాయమూర్తి తేల్చి చెప్పేశారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతల్లో జీఎంఆర్ గ్రూప్ కు మాల్యా ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మాల్యాపై ఎర్రమంజిల్ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి కూడా విదితమే. దీనిపై గతంలో విచారణ జరిపిన కోర్టు మాల్యాకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

 

అయితే సదరు అడ్రెస్ లో మాల్యా లేకపోవడంతో తిరుగుటపాలో కోర్టుకే వచ్చాయి. అయితే అప్పుడు కూడా దోషి లేనిదే శిక్ష విధించడం కుదరదని చెప్పిన కోర్టు.. ఈసారి కూడా అదే నిర్ణయానికి కట్టుబడింది. దోషి లేకుండా శిక్ష ఖరారు చేయలేమన్న న్యాయమూర్తి... కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు. అప్పటిలోగానైనా మాల్యాను తమ ముందు హాజరుపరచాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరి విజయ్ మాల్యా కోర్టుకు వచ్చి.. ఆయనకు శిక్ష విధించినప్పుడు సంగతి...