TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ విఫలమైన విద్యుత్‌ ఉద్యోగుల చర్చలు

Published on: Tue Oct 8, 2013 9:17PM

 

                         ఈ సాయంత్రం తిరిగి సి.ఎం తో సమావేసమైన విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలమైనాయి. సమ్మె విరమించం ... సమ్మె కొనసాగుతుంది ..... అత్యవసర సేవలకు కూడా ఉద్యోగులు ఎవరు హాజరు కారని విద్యుత్ ఉద్యోగులు ప్రకటించటం జరిగింది. ఇప్పటికే సీమాంద్ర ప్రాంతం లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సమ్మె తాలూకు ప్రభావం హైదరాబాదు మీద కూడా పడింది. దాని కారణంగానే హైదరాబాదులో కూడా గత రెండు రోజులుగా అత్యవసర కోతలు విధిస్తున్నారు. ఈ విద్యుత్ కోతల కారణంగా చిరు వ్యాపారులు,చిన్న పరిశ్రమలు చాల నష్టపోతున్నాయని ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు.