చీకట్లు కమ్ముకుంటున్న రాష్ట్రం

 

తెలంగాణ నోట్‌కు కేభినెట్‌ ఆమోదం రావటంతో సీమాంద్రలో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఎపిఎన్జీవోలతో పాటు పలు ప్రజాసంఘాలు ఉద్యోగ సంఘాలు సమ్మెలో ఉండగా ఆదివారం ఉదయం నుంచి విద్యుత్‌ ఉద్యోగ సంఘం కూడా సమ్మెలోకి దిగనుంది.

 

రేపు ఉదయం ఆరుగంటల నుంచి సీమాంద్ర జిల్లాల్లోని అన్ని విధ్యుత్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్టుగా విధ్యుత్‌ ఉద్యోగుల ఐకాస చైర్మన్‌ సాయిబాబ ప్రకటించారు. సమ్మె నుంచి అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

 

జెన్‌కో, డిస్కంలతో పాటు వివిధ సంస్ధలకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు  ఈ సమ్మెలో పాల్గొననున్నారు. విభజన నోట్ వెనక్కి తీసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు సాయిబాబ. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో మన రాష్ట్రంతో పాటు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో అంధకారం అలుపుకోనుంది.