వనదేవతలకు బంగారం సమర్పించిన ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన నిమిత్తం ఇవాళ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో మేడారం సమ్మక్క-సారక్క జాతర వద్దకు చేరుకున్నారు. తన బరువుకు తగ్గట్టుగా బెల్లాన్ని సమర్పించి.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా మేడారంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతి వెంట తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.