TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ల్యాంకోపై వి.హెచ్ ఫైర్

Published on: Sun Dec 18, 2011 8:10AM

హైదరాబాద్: ఎంత మందికి ల్యాంకో ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలని ల్యాంకోపై కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు  డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన  మీడియా ప్రతినిధులతో చెప్పారు. వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయని ఆయన అన్నారు.వక్ఫ్ భూములను రీసర్వే చేయించాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. ఐటి పోరు మీద భూములు తీసుకుని సంస్థలు వాటిని అమ్మకానికి పెట్టాయని ఆయన ఆరోపించారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే మాటలో నిజం లేదని మంత్రి శంకరరావు విడిగా అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి నాయకులు తెలంగాణపై దీక్షలు చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.  వివాదాస్పదమైన అంశాలు ఉంటే తాను మంత్రి వర్గ సమావేశానికి వెళ్లబోనని, ఎజెండాను బట్టే సమావేశానికి వెళ్తానని ఆయన చెప్పారు.