కాంగ్రెస్ కల్చర్ అర్ధం చేసుకో.. ఇక్కడ దాదాగిరి నడవదు: రేవంత్ కు సీనియర్ సలహా

 

హుజూర్‌ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి మధ్య చిచ్చు రేపిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కోమటిరెడ్డి , జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలంతా ఉత్తమ్‌కు మద్దతుగా నిలబడుతూ నల్గొండ రాజకీయాలతో రేవంత్‌కు ఏం పని అని ప్రశ్నించారు. ఇపుడు ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో కోర్ కమిటీ సమావేశంలో ఉత్తమ్ చర్చించారని, పద్మావతి అభ్యర్థిత్వం విషయంలో రేవంత్ అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదని అయన ప్రశ్నించారు. రేవంత్‌కు కోమటిరెడ్డి కౌంటర్ ఇవ్వడంలో తప్పేమీ లేదన్నారు. పద్మావతిని గెలిపించుకుంటామని నల్గొండ నేతలు ధీమాగా చెబుతుంటే, ఇక దానిపై రాద్దాంతం చేయాల్సిన అవసరమేముందని విహెచ్ మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల్లో లాగా కాంగ్రెస్‌లో దాదాగిరీ నడవదని అయన రేవంత్ ను చ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్‌లకు నోటీసులు ఇచ్చే పద్దతి లేదని.. కొత్తగా వచ్చినవాళ్లకు కాంగ్రెస్ కల్చర్ అర్థం కావడం లేదని అయన అన్నారు.