శశికపూర్కి తీవ్ర అస్వస్థత
Published on: Mon Sep 22, 2014 11:08AM

అలనాటి బాలీవుడ్ అందాల కథానాయకుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనను ఆదివారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వున్నారు. శశికపూర్ ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడుతున్నారు. ఆదివారం ఆయన శ్వాస అందక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇంటెన్సివ్ కేర్లో వున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదని వైద్యులు చెబుతున్నారు. శశికపూర్ 160కి పైగా సినిమాలలో నటించారు. ఆయన మూడుసార్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.


