క్యా సీన్ హై..!
Published on: Fri Jul 1, 2022 4:44PM
అత్యంత అరుదైన ఫొటో ఇది.. ఈ ఫోటోలో ఉన్న ముగ్గురిలో ఒకరు మాజీ రాష్ట్రపతి, మిగిలిన ఇద్దరూ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో ప్రత్యర్థులు.
కాగా ఈ ఫొటో ఇప్పటిది కాదు. 2016 నాటిది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వినోబా భావే యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆ సందర్బంగా యశ్వంత్ సిన్హాకు గౌరవ డీ లిట్ ప్రదానం చేశారు.
అప్పటి జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఈ చిత్రంలో ఉన్నారు. ప్రస్తుతానికి వస్తే నాడు అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ డీలిట్ పట్టా అందుకున్న యశ్వంత్ సిన్హా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి.. అప్పటి జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి.


