Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిజమైన పసుపు సైనికుడు పిఠాపురం వర్మ.!
posted on: Jul 28, 2026 10:23AM

తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి విదితమే. . బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడమే కాకుండా, పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇచ్చిన ఘాటైన సమాధానం పార్టీ అధిష్టానానికి సవాలు విసురుతున్నట్లుగా మారింది. అధికారంలోకి వచ్చి ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తి కాకముందే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలనంగా మారింది.
బోండా ఉమ త్వరలోనే వైసీపీ గూటికి చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదలా ఉంటే.. బోండా ఉమ వైఖరి వల్ల పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకుని బోండా ఉమా తీరును గట్టిగా ఖండిచి, విమర్శించాల్సిన తెలుగుదేశం కీలక నేతలు మౌనం వహించారు. పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారు, భవిష్యత్తులో మంత్రి పదవులు లేదా ఉన్నత స్థానాలు ఆశిస్తున్న అగ్రనేతలు బొండా ఉమా వ్యాఖ్యలపై స్పందించడం లేదు.
అయితే.. పిఠాపురం వర్మ మాత్రం నిజమైన పసుపు సైనికుడిగా బోండా ఉమ తీరును గర్హించారు. ఇటీవల పార్టీ అధిష్టానం తనను పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో కాపు ఉద్యమం వల్లే టీడీడీపీ ఓడిపోయిందన్న ఉమా వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ పిలుపుతోనే ప్రజలకు ఆ పార్టీకి ఓటేశారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టడం సరికాదని ఉమాకు హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు పెద్ద పీట వేశారని.. రిజర్వేషన్ల అంశం, కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపు, కాపు భవనాల నిర్మాణం, విదేశీ విద్య పథకం, స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలను అమలు చేసినది చంద్రబాబునని పిఠాపురం వర్మ పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ మేరకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని వర్మ గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు.
కూటమి స్థిరత్వం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం నాయకత్వం కొన్నిసార్లు క్షేత్రస్థాయి లాయలిస్టులను పక్కన పెట్టాల్సి రావచ్చు, కానీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అనేది బయటపడేది సంక్షోభ సమయంలోనేననీ, ఆ విషయం వర్మ బోండా ఉమాకు ఇచ్చిన కౌంటర్ తో మరోసారి రుజువైందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
SVSN Varma, Pithapuram Varma, Chandrababu Naidu, Bonda Uma, TDP Political News


.webp)



