ఎన్నికల బరిలో కమెడియన్..చంద్రబాబు కాదన్నారా?

 

ఇప్పటికే పలువురు సినీరంగానికి చెందిన ప్రముఖులు రాజకీయాల్లో అడుగుపెట్టారు.నేడు మరో కమెడియన్ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమవుతన్నారు.నిన్నా మొన్నటి వరకు ఓ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ కమెడియన్ నేడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.ఆయనే ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్.వేణు మాధవ్ స్వస్థలం కోదాడ.ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.అప్పట్లో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు.పార్టీ ఆవిర్భావం తరువాత వేణు మాధవ్ పార్టీ సభల్లో పాల్గొని తన మిమిక్రి ద్వారా ప్రచార కార్యక్రమాన్ని చేట్టారు.అనంతరం సినిమాల్లో అవకాశాల్లో రావటంతో రాజకీయాలకు కాస్త దూరం అయ్యారు.

 

 

గత కొన్నేళ్లుగా ఆయన టీడీపీ పార్టీ సభల్లో పాల్గొంటున్నారు.గత ఎన్నికల్లో సైతం పార్టీ తరుపున ప్రచారం చేశారు.అయితే వేణు మాధవ్ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అని స్పష్టం చేశారు.నామినేషన్ కూడా వేయటానికి సిద్ధమయ్యారు.ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగి ఉండటం, ఆయన మిత్రులంతా కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు వేణు మాధవ్ తెలిపారు.అయితే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుతో వేణు మాధవ్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.కోదాడ నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబుని అడగ్గా ఆయన పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేయించినట్టు తెలిపారట.దీంతో వేణు మాధవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.