వెంకీ రాధాకు కథ పరీక్ష
posted on: Feb 11, 2014 9:56AM

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రాధా". ఈ చిత్ర కథ కాపీ కొట్టిందని వస్తున్న వార్తలపై ఈ చిత్ర దర్శకుడు మారుతి స్పందిస్తూ... "గతంలో ఓ ఎమ్మెల్యే బంధువు వెంకటేష్ గారికి ఇలాంటి కథే ఒకటి వినిపించారు. ఆ కథనే వెంకీ నాతో ఈ సినిమా చేయిస్తున్నాడని సదరు వ్యక్తులు రచయితల సంఘానికి ఫిర్యాదు చేసారు. అసలు ఇంతవరకు నేను వెంకీ గారికే కథ పూర్తిగా చెప్పలేదు. కథపై నాకే పూర్తిగా క్లారీటి లేదు. అలాంటిది కాపీ కొట్టడానికి ఛాన్స్ ఎక్కడిది. ఈ నెల 14న వెంకటేష్ గారికి కథ చెప్పబోతున్నాను. నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి. ఒకరి కథల్ని కాపీకొట్టాల్సిన అవసరం నాకు లేదు. వేరొకరి కథ దొంగిలించి నేను ఈ సినిమా చిత్రీకరిస్తున్నాను అని అనడం అవాస్తవం. నా "రాధా" కథ.. రచయితల సంఘం పరిశీలనకు వెళ్ళింది. నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్ కి వెళతాను" అని అన్నారు. మరి మారుతి నిజాయితీ మరి కొద్దిరోజుల్లోనే తెలియనుంది.






