స్వరం మార్చిన వెంకయ్య

 

venkaiah naidu on telangana, bjp, telangana state, telangana note, seemandhra

 

 

 

తాము అధికారం లోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని బి.జె.పి ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్న మహబూబ్ నగర్ లో జరిగిన బి.జె.పి బహిరంగ సభలో సుష్మ స్వరాజ్ ఈసారి కనుక తెలంగాణా ఇవ్వకుంటే తనే స్వయంగా ఉద్యమంలో పాల్గొంటానని హెచ్చరించారు. మొన్న కాంగ్రెస్ కేబినేట్ నోట్ తెలంగాణ పై నోట్ ఆమోదిస్తే ఆ నోటును బి.జె.పి ఆహ్వానించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ను గుజర్రత్ కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో నిర్వహించిన బి.జె.పి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.ఇవన్ని ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా బి.జె.పి అగ్రనేతలలో ఒకరైన మాజీ మంత్రి వెంకయ్యనాయిడు తెలంగాణ పై తన స్వరం మార్చారు. మొన్నటి వరకు తెలంగాణ అంశం త్వరగా తేల్చాలని పట్టుబట్టిన ఆయన ముందు సీమాంద్ర ప్రాంత సమస్యలు పరిష్కరించి ఆతర్వాత రాష్ట్రాన్ని విభజించాలని సూచించారు. అసలు ఇప్పటి వరకు సీమాన్ధ్రులు విభజన అనంతరం తాము ఎడుర్కొనబోయే సమస్యలు ఏమిటో చెబుతున్న వాటిపై బి.జె.పి తన దృష్టిని సారించలేదు. హైదరాబాదు విషయం లోను ఎలాంటి అభిప్రాయాన్ని కాని సూచనను కానీ చేయలేదు. నదీ జలాల సమస్యలు,ఉద్యోగాల సమస్యల పై తమ వైఖరేమిటో బి.జె.పి ఇంతవరకు ఏవిధమైన స్పష్టతను తెలియ చేయ లేదు. మరి ఈ సమస్యలన్నిటి మీద వెంకయ్యనాయుడు ఐన ఒక సీనియర్ నేతగా తన నిర్ణయాన్ని తెలియచేస్తారా అంటే అది సందేహమే!ఒక పక్క సుష్మాస్వరాజ్ తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమిస్తానంటారు,మరోపక్క వెంకయ్య నాయుడు సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే విభజన చెయ్య మంటారు. ప్రతి రాజకీయ పార్టీకి తెలంగాణ అంశం ఒక ఆట వస్తువుగా తయారైంది . ప్రతి నేత ఇరుప్రాంత ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. మరిస్వరం మార్చిన బి.జె.పి నేత వెంకయ్య నాయుడు ను తెలంగాణ ప్రాంత నేతలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.