వెంకయ్య అలా మాట్లాడితే మజా వస్తది..

 

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడిన మోడీ.. వెంకయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను పొగొడ్తలతో ముంచెత్తారు. ముందుగా వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు చెబుతూ... దేశంలోని వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరని అన్నారు. రైతు బిడ్డగా ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, పార్టీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇదే సభలో పెరిగిపెద్దవాడైన వెంకయ్యనాయుడు ఇదే సభకు నాయకుడిగా రావడం ఆనందకరమని.. వెంకయ్యనాయుడు ఏం మాట్లాడినా బాగుంటుందని ..అదే వెంకయ్యనాయుడు తెలుగులో మాట్లాడుతుంటే మాత్రం అనర్గళంగా మాటల మంత్రమేసినట్టు ఉంటుందని అన్నారు. అప్పుడు ఆ మాటల వేగం చూసి మజా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.