ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం...

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో ఆయన 13వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెంకయ్యనాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, అద్వానీ, మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.