ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు..?

విపక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని తెర మీదకు తీసుకురావడంతో ఎన్డీఏ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పదవికి వెంకయ్య అన్నివిధాలా సమర్థుడనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో వెంకయ్యపై మంచి అభిప్రాయం ఉండటంతో సులభంగా మద్ధతు లభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. దీనిపై ఒకసారి ఎన్డీఏ నేతలతో చర్చించే అవకాశం ఉంది.