వేములవాడ ఎమ్మెల్యేమీద కంప్లైంట్
Published on: Wed Nov 28, 2012 12:42PM
.jpg)
కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి అనర్హుడంటూ రాజకీయ ప్రత్యర్ధులు అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రెండు విధాలుగానూ లాభపడుతున్నారని ఓ లాయర్ కంప్లైంట్ ఇచ్చారు.
చెన్నమనేని మీద ఓ లాయర్ కంప్లైంట్ ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా కొనసాగదలచుకున్న వ్యక్తి మరో లాభదాయకమైన పదవిలో ఉంటూ ఆర్థికపరమైన లాభాన్ని పొందడం నేరమని, నిబంధనల ప్రకారం చర్య తీసుకోవాలని కోరుతూ న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు.


